ఇండియన్ హీరో - అమూల్య సేవ .
గంగధర తిలక్ కాట్నం గారు ఇండియన్ రైల్వే లో 35 సంత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేసి 2008 సంవత్సరములో పదవీ విరమణ పొందినారు. వారిది పశ్చిమ గోదావరి జిల్లాలోని యర్నగూడెం గ్రామము.ఒక సామాన్య రైతు కుటుంబం లో 1948 అక్టోబరు లో జన్మించినారు.
గంగధర తిలక్ కాట్నం గారు ఇండియన్ రైల్వే లో 35 సంత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేసి 2008 సంవత్సరములో పదవీ విరమణ పొందినారు. వారిది పశ్చిమ గోదావరి జిల్లాలోని యర్నగూడెం గ్రామము.ఒక సామాన్య రైతు కుటుంబం లో 1948 అక్టోబరు లో జన్మించినారు.
రైల్వే లో పదవీ విరమణ తర్వాత , 2010 జవవరిలో INFOTECH ENTERPRISES LTD. ( design Engineer) గా జాయిన్ అయినారు .
మొదటి రోజున తన కారు లో వెల్తుండగా, కారు చక్రం వర్షపు నీటితో నిండిన గోతిలో పడి, బురద నీరు స్కూలుకు వెళ్తున్న చిన్నారి పాప పై చింది, యూనిఫారం పాడైనది . ఆమెతో వెళ్తున్న ఆమె తల్లి పై కుడా బురద పడింది. అది చూసి కలత చెందిన తిలక్ తన కారు ఆపి క్రిందకు దిగి వారికి క్షమాపణ చెప్పి , తన ఆఫీసుకు వెళ్ళినారు. కాని, తన మనసంతా జరిగిన దానికి బాధ పడుతూనే వున్నది. ఆ సాయంత్రము ఇంటికి తిరిగి వస్తూ ఒక చోట, ఇంటిపనుల నిర్మాణము జరుగుచున్న చోట ఆగి , 6 ట్రక్కుల మట్టిని తెచ్చి పోయమని వారికి 5000/- రూపాయలు చెల్లించి , ఆ శని ఆదివారములు తాముకూడా కలసి ఇద్దరు కూళీలను పెట్టుకొని ఆ మట్టి రోడ్డులో వున్న మొత్తము సుమారు 60-70 గుంతలను పూడ్చి వేసినారు.
కొన్ని రోజుల తర్వాత LANGARHOUSE- NARSINGI రోడ్డు పై ఆఫీసుకు వెళ్తుండగా, ఆ రోడ్డు పై వున్న ఒక గుంతను తప్పించుకొనే ప్రయత్నము లో బైకు పై వెళ్తున్న ఒక యువకుడు పడిపోగా అతని కాళ్ళపై నుండి ఒక కారు వెళ్ళిపోగా , అతని రెండు కాళ్ళూ విరిగిపోయి తలకు కుడా బలమైన గాయాలు అయినాయి. మరి కొన్ని రోజుల తర్వాత అదే రోడ్డులో ఒక గొయ్యి కారణం గా ఆటోను , బస్సు గుద్ది ఒకరు చనిపోగా , ఇద్దరికి తీవ్రమైన గాయాలు తగిలినాయి . ఈ పై రెండు సందర్భాలలో కూడా , ఆ గుంతలు వలన ప్రమాదముంజరిగినట్లు వ్రాయమనని పోలీసులకు చెప్పగా అందులకు వారు సుముఖముగా లేరు.
ఈ గుంతల వలన జరుగు చున్న ప్రమాదములు చూసి చలించిన గంగాధర తిలక్ , అక్కడే రోడ్డు ప్రకన ఫుట్ పాత్ ల పై పడి వున్న తారు పెళ్ళలను తెచ్చి ఆ గోతిలో వేయగా అవి చక్కగా సెట్ అయిన విధానము గ్రహించి , ఆ రోజు నుండీ తన ఫియట్ కారు లో , పది ఖాలీ బస్తాలు పెట్టుకొని , ఫుత్ పాత్ ల పై కనిపించిన తారు పెళ్ళలను ఆ బస్తాలులో నింపుకొని , తనకు కనిపించిన ప్రతీ గుంతనూ పూడ్చము తన పనిగా పెట్టుకొని, వారంతమలో శని ఆది వారాలలో హైదరాబాదు నగరము లో రోడ్లపై గుంతలు పూడ్చు చున్నారు.
ఆ విధముగా ఒకటిన్నర సంత్సరము గుంతలు పూడ్చిన తర్వాత , తాను పూడుస్తున్న గుంతలు చాలా ప్రమాదాలను తప్పిస్తున్నాయి అని పూర్తి విశ్వాసము కలిగి , తాను చేస్తున్న సాప్టువేరు వుద్యోగము వదలి 2011 ఆగష్టు నుండి ప్రతి దినము గుంతలను పూడ్చే పని మొదలు పెట్టినారు .
మీరు 70,000/- రూపాయలు వస్తున్న వుద్యోగము ఎందులకు మానేసారు అంటే ఆయన సమాధానము :
"ఈ గుంతల వలన ప్రమాదము లో ఆ కుటుంబములో సంపాదనాపరుడైన వ్యక్తిని కోల్పోయిన చో
ఈ 30 రోజులలో నేను సంపాదించిన మొత్తము ఇచ్చిన కుడా ఆ కుటుంబానిని ఆదుకొనలేము. అదే ముప్పది రోజులలో 30 పైగా గుంతలనుంపూడ్చ వచ్చును అనే ఆలోచన తో ఆ వుద్యోగము వదిలేసినాను అంటున్నారు" అదియును గాక, "ఈ గోతుల వలన కాళ్ళూ చేతులూ విరిగిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు విషయము బయటకు తెలుస్తాయి ,కానీ చాలా మంది నడుం నొప్పులు, మెడ నొప్పులు , వెన్నుపూసలు బాధలతో జీవచ్చవాలు గా బ్రతుకు వెళ్ళదీస్తూ , వైధ్యానికి లక్షలు ,లక్షలు ఖర్చు చేసినా ఫలితము లేక బాధలు అనుభవిస్తున్నారు" అందువల్ల నేను చేయగలిగిన పనిని నాశక్తికొలది చేసుకొంటూ వెళ్తున్నాను అంటున్నారు.
Contd....