ఈ డైటింగ్‌కు ఓ చరిత్ర కూడా ఉంది. అది 1807 సంవత్సర కాలం. అప్పటి రాజు విలియం విపరీతంగా బరువు పెరిగి పోవడం వల్ల గుర్రాన్ని ఎక్కడం తలకుమించిన భారంగా మారింది. ఈ అధిక బరువు వల్ల అనేక రోజువారీ దినచర్యలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టు గుర్తించాడు.
దీంతో బరువు ఎలా తగ్గాలన్న అంశంపై దృష్టిసారించాడు. ఫలితంగా రోజువారీ సాధారణ ఆహారానికి బదులుగా కేవలం ఆల్కహాల్‌ను మాత్రమే ప్రత్యామ్నాయంగా తీసుకోవడం ప్రారంభించాడు. ఈ ఆల్కహాల్ డైట్ ఆయనకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వక పోయినప్పటికీ... దేశంలోని మిగిలిన స్థూలకాయులు ఇదే ప్రక్రియను కొనసాగించారు.
వీరిలో పెక్కుమంది విజయం సాధించడంతో ఈ డైటింగ్ థియరీకి మంచి ప్రాచూర్యం లభించింది. అప్పటి నుంచి చాలా మంది డైటింగ్ చేస్తూ, తన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు.