మన శరీరంలో అనేక వ్యవస్థలున్నాyi . . ఇవన్నీ వాటి పనుల్ని అవి నిర్వహించుకుంటూ ఉన్నా, అన్నీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాyi. ఒక వ్యవస్థ పనిలో ఆటంకం ఏర్పడితే ఆ ప్రభావం మిగతా వ్యవస్థల మీద కూడా ఉంటుంది. మధుమేహంలో ఈ ప్రభావం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. శరీరంలో జరిగే జీవచర్యలో భాగంగా తయారయ్యే రక్తంలో ప్రవేశించిన గ్లూకోజ్‌ను శరీరం సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం వలన కలిగే స్థితిని మధుమేహం అంటారు.
-ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోని వాళ్లే! 35 మిలియన్లకి పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా. 30 శాతం మంది ప్రి-డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కి పైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుండి. డయాబెటిస్ అనే వ్యాధి కాదు, కాని అనేక వ్యాధులకు మూలం. ఇలా విస్తృతంగా పెరిగిపోతున్న డయాబెటిస్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫెడరిక్ బ్యాంటింగ్, చార్లస్ వెస్ట్‌తో కలిసి 1922లో ఇన్సులిన్‌ని కనుక్కున్నారు.
పాంక్రియాజ్ గ్రంథి లోపం వల్ల ఇన్సులిన్ హార్మోన్ లోపించడంతో ఈ డయాబెటిస్ వస్తుంది. రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగు తాయి. నరాలు దెబ్బతింటాయి. త్వరగా మరియు తీవ్రంగా వచ్చే కాంప్లికేషన్స్ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్‌కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ కోమా... వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు . తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు, మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్ రెటి నోపతి, డయాబెటిక్ న్యూరోపతి, గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. అభివృద్ధి చెందిన దేశాల్లో యుక్త వయసులోనే అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్ అవసరమయ్యే డయాబెటిక్ నెఫ్రోపతికి ప్రధాన కారణం డయాబెటిక్.
రక్తనాళాలు దెబ్బతింటే వాస్కులోపతి. ముఖ్యంగా నరాల మీద ‘మైలీన్’ అనే సన్నని పొర ఉంటుంది. ఇది దెబ్బతింటే లోపల సంకేతాల్ని అందచేసే ‘యాక్సాన్’ దెబ్బతింటుంది. దాంతో మెదడు నుంచి శరీరభాగాల్లోకి, శరీరం నుంచి మెదడులోకి సంకేతాలు సరిగ్గా అందవు. ఈ సమస్య పాదాలు, అరిచేతుల్లో ప్రారంభమవుతుంటుంది. ఎందుకంటే పొడవాటి నరాలు శరీరం కోసల్లో ఉండే నరాలు ముందుగా దెబ్బతింటాయి. కాబట్టి దాంతో అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు, మొద్దు బారటం లాంటివి జరుగుతాయి.
మెదడులోని కణాలు సక్రమంగా పనిచేయడానికి బ్లడ్ షుగర్ చాలా అవసరం. అందుచేత తక్కువ బ్లడ్ షుగర్ ‘మైకం, గందరగోళం, నీరసం, వణుకు’ మొదలైన సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌కి సంబంధించిన అనారోగ్య లక్షణాలను కలిగిస్తుంది. ఈ లక్షణాలు కలిగే బ్లడ్ షుగర్ ప్రమాణం డెసీలీటర్‌కి 65 మి.లీ.కు పడిపోతే కలుగుతాయి. బ్లడ్ షుగర్ ప్రమాణం మరీ పడిపోయి 40. మి.లీ. కిందికి చేరితే కోమాలోకి దారి తీస్తుంది. మధుమేహం ఒక వ్యాధి కాదు, షుగర్ జీవచర్య సరిగ్గా జరగకపోవడం వల్ల కలిగే శారీరక స్థితి.
దీనిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి నెలకు ఒక్కసా రైనా పొద్దున్నే ఆహారం తినకముందు, ఆహారం తిన్న గంటన్నర తర్వాత రక్తపరీక్ష చేయించు కోవాలి. దాని ద్వారా రక్తంలోని షుగర్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేయించుకోవడం కూడా అవసరం. సంవత్సరానికి ఒకసారి కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాల పనితీరు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి.
మధుమేహ పరీక్షలు చేయించుకునే ముందు శరీరానికి అధిక శ్రమ కలిగించకూడదు. పరీక్షల కోసం ఎక్కువ దూరం నడవకుండా, పరీక్షా కేంద్రం ఇంటి పక్కనే ఉండేటట్లు చూసుకోవాలి. లేదా వెళ్ళ డానికి ఏదైనా వాహనాన్ని ఆశ్రయించాలి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోని ఉన్నా, ప్రయాణం చేసి వచ్చినా, ఎక్కువ శ్రమ పడినా ఉదయాన్నే రక్తపరీక్షలు చేయించుకోకూడదు. చేయించుకుంటే రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ కనబడుతుంది.
డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం, దీనిలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమం. రోగి గాని రోగి యొక్క కుటుంబంలోని వారుగాని అలవాటుగా తినే ఆహారాన్ని కొన్ని నియమాలతో తీసుకోవాలి. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి.
-పప్పు దినుసుల నుండి లభించే ప్రొటీన్లు, మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లు కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రొటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మధుమేహాన్ని నివారించటం లోనూ, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించ డంలోనూ ఉపయోగపడతాయి. ఆకు కూరలు, కూర గాయల్లో పీచు అధికంగా ఉంటుంది. మెంతుల్లో పీచు పదార్థాం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని, చికిత్సను సహాయకారిగా తీసుకోవచ్చు. మీ పాదాలకి సౌకర్యంగా ఉండే అనువైన పాదరక్షలను వాడాలి.
-ధూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి. ఎక్కువ కొలస్ట్రాల్ ఉండే నూనెలు గాని, మాంసా హారాలు గాని, నూనే అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం పూర్తిగా తగ్గించాలి.రోజు తగినం తగా వ్యాయామం చేస్తూ ఉండాలి. తక్కువగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నడుస్తూ ఉండాలి. మీ రక్తపోటు, శరీర బరువు, నడుము చుట్టుకోలత - ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోగలం.