నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం
జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం. ఠీజుట్టు పెరిగేందుకు సిలికా అనే మినరల్ చాలా అవసరం. క్యాబేజీ, దోసకాయ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, ఓట్స్‌లో ఈ మినరల్ అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది. ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది. మీరు మాంసాహారులైతే చికెన్ తీసుకోవడం వల్ల నిగనిగలాడే జుట్టును సొంతం చేసుకోవచ్చు. చుట్టు ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్, ఐరన్ చికెన్‌లో లభిస్తుంది. ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది.