చుండ్రు రావడానికి కారణాలు,నివారణ పద్ధతులు

CHANNEL HYDERABAD
Dandruff  : 
చుండ్రు రావడానికి కారణాలు  :
శిరోజాల విషయంలో శ్రద్ధ లోపించడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల్లో స్తబ్ధత, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు చుండ్రుకు కారణమవుతాయి. అధిక చెమట, అపరిశుభ్రత, అలర్జీ, ఒత్తిడి, ఆందోళన, అధిక తీపి, కొవ్వు పదార్థాలను తినడం, పోషకాహార లోపంవంటివి చుండ్రు సమస్యకు దారితీస్తాయి.
అధిక చెమట, అపరిశుభ్రత, అలెర్జీ, విశ్రాంతి లోపించడం, ఒత్తిడి, ఆందోళనలు, అధిక తీపి, కొవ్వు పదార్థాలను తినడం, పోషకాహార లోపం, శిరోజాల సౌందర్య ఉత్పాదనలను అధికంగా వినియోగించడం, ఎలక్ట్రిక్ మెషిన్లను ఉపయోగించడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి.
నివారణ పద్ధతులు    :
  • ఈ చుండ్రును నివారించాలంటే కుదుళ్లలో ఉండే అసిడిక్ పీహెచ్ స్థాయి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆరు స్పూన్ల నీళ్లను రెండు స్పూన్ల వెనిగర్‌తో కలిపి దూదితో శిరోజాల మొదళ్లలో చర్మంపై రాసుకోవాలి. వారానికో రోజు నిద్రించడానికి ముందుగా ఇలా రాసుకుని మర్నాడు ఉదయం వెనిగర్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం మూడు నెలల పాటు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
  • రాత్రిపూట పెరుగులో మెంతులను నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. అర్థగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు చక్కని పోషణ లభిస్తుంది.
  • రెండు గుడ్ల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కలుపుకోవాలి. తలను నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని తలపై రాసుకుని మర్ధన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలేసమస్య తగ్గిపోతుంది.
  • గోరువెచ్చని కొబ్బరి నూనె లేక ఆముదాన్ని వారానికి రెండు సార్లు రాత్రి నిద్రించడానికి ముందుగా తలకు పట్టించుకోవాలి. తర్వాత వేళ్లతో తలపై గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తల పొడిగా మారకుండా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది. అలాగే శిరోజాలు రాలకుండా ఉంటాయి.
  • లీటర్ నీటిని బాయిల్‌చేసి అందులో ఒక గుప్పెడు రోజ్‌మెరీ ఆకులను వేసి నానబెట్టాలి. అలా ఒక రాత్రంతా ఉంచి మర్నాడు ఉదయం అందులో రెండు స్పూన్ల వెనిగర్‌ను కలపాలి. షాంపూతో తలంటుకున్న తర్వాత ఈ ఈ నీటితో శిరోజాలను కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది
  • తలస్నానం చేయడానికి పదిహేను నిమిషాలు ముందుగా అలోవెరాజెల్‌ను తలకు రాసుకోవాలి. తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా ప్రతిరోజూ లేదా రెండు మూడు రోజులకోసారి చేయడం వల్ల చండ్రు సమస్యను దూరంగా ఉంచవచ్చు.
  •  హెన్నా కూడా చుండ్రుని నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు హెన్నాని తలకు పట్టించి మర్నాడు తలస్నానం చేయండి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
  • ఆలివ్ నూనెకు కొబ్బరి నూనె కలిపి తలస్నానం చేయడానికి అర్థగంట ముందు తలకు రాసుకుని తేలికగా మర్ధన చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేస్తే సరి.
  •  ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని తలపైన రాసుకుని మర్ధన చేసుకోవాలి. అర్థగంట తర్వాత గుడ్డుతో తలస్నానం చేయాలి.
  •  ఎండిన నారింజ పండు తొక్కలు, ఉసరికాయ పెచ్చులు, కుంకుడు, శీకాయలను సమంగా కలిపి నీళ్లకు చేర్చి మరిగించి తలస్నానం కోసం వాడాలి. దీనికి ముందు పుల్లని మజ్జిగను తలకు పట్టించాలి.
  • మినుములను జిల్లేడు పాలతో కలిపి ఎండబెట్టి పొడిచేసి నిల్వ చేసుకోవాలి. దీనిని తగినంత తీసుకొని ఆవనూనెతో కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • కొబ్బరినూనెకు నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి గంట తరువాత శీకాయ కషాయంతో తల స్నానం చేయాలి.
  • చందనం (మంచిగంధం) తైలం 1 భాగం, నిమ్మరసం 3 భాగాలు కలిపి జుట్టుకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి.
  • గసగసాల గింజలను పాలతో సహా పేస్టుమాదిరిగా మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచుకోవాలి.
  • .మామిడి టెంకను పగులగొడితే జీడి బయటపడుతుంది. దీనిని సేకరించి, సమానంగా కరక్కాయ పెచ్చులకు కలిపి పాలతో సహా మెత్తగా నూరి తలకు లేపనం చేసుకొని గంట తరువాత తలస్నానం చేయాలి.
  • మెంతుల గింజలను మెత్తగా నూరి పెరుగు కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి.