1.నిమ్మరసంలో రాళ్ళ ఉప్పు కలిపి దాంతో ఫేస్ రుద్దుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
2.శనగపిండి ఒక స్పూన్, కొంచెం పసుపు, కర్పూరం, ఉప్పు, 2-౩చుక్కల కొబ్బరినూనె లేదంటే నువ్వుల నూనె కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే చర్మం లోని జిడ్డు అంతా మటుమాయం.
3.ఫేస్ మీద ముడుతలు తగ్గాలంటే ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ కోడి గుడ్డు లోని తెల్ల సోన వేసి కలిపి ఫేస్ కి పట్టించి ఆరనించి కడగాలి.
4.ఫేస్ మీద సన్నని నూనుగు వెంట్రుకల్ని తొలగించటానికి బాదంపప్పులు, శనగపిండి, ఒక స్పూన్ పాలు, తాజా నిమ్మరసం కొన్ని చుక్కలు వేసి నూరి మసాజ్ చేయాలి.
5.ఫేస్ మంచి చాయ తో మరిసిపోవాలంటే 5 స్పూన్ ల ఆరంజ్ రసం, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ నిమ్మరసం, కలిపి మసాజ్ చేసుకోవాలి.
6.ఫేస్ మీద ఒక మొటిమ కుడా రాకుండా ఉండి, చక్కని ఒంటి చాయ రావాలంటే 8 -10 తులసి ఆకుల్ని మెత్తగా నలిపి నిమ్మరసంలో వేసుకుని ప్రతి రోజు మొహానికి పట్టించుకుని ఆరిన తరవాత కాసేపటికి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
7.ఫేస్ మీద ముడుతలు పోవాలంటే తురిమిన కారోట్, ఒక స్పూన్ పాలు వేసి మెత్తగా నూరి దాన్ని ఫేస్ ప్యాక్ ల పట్టించుకోవాలి.
8.మొటిమలు, బ్లాకు హెడ్స్ పోవాలంటే కాకరకాయ తొక్కుతో ఫేస్ మీద రుద్దాలి.
9.మొటిమల మచ్చలతో మీరు బాదపడుతోంటే ముల్లంగి రసం, అంతె పరిమాణంతో పెరుగు కలిపి ఫేస్ కి రాసుకుని గంట పోయిన తరువాత కడిగేసుకోవాలి.
10.ఫేస్ జిడ్డుగా ఉంటె రాత్రిళ్ళు గులాబీ ఆకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో ఫేస్ కడుక్కుంటే తేటగా ఉంటుంది.
11.ఫేస్ మీద మచ్చలు, మొటిమలు పోవాలంటే పరగడుపున నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్లు తాగాలి.
12. సుగంధ పాలవాయువితంగాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, కస్తూరి, పసుపు, ఎండిన వేప, తులసి, మారేడు ఆకులు, నిమ్మకాయతోలు ఎండినవి, మంజిష్టా అన్నింటినీ సమభాగాలుగా ఎండబెట్టి చూర్ణించి కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పొట్టు ఉన్న పెసర్లు దోరగా వేయించి పొడి చేసుకుని అందులో చూర్ణాన్ని కలుపుకుని ప్రతి రోజూ శరీరానికి నూనె రాసుకుని ఈ పిండితో నలుగు పెట్టుకుంటే శరీరంపై పేరుకున్న కొవ్వు కరిగిపోయి చర్మం అందంగా మెరుస్తుంది. చర్మవ్యాధులు రావు.
13.టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జులో అర టేబుల్ స్పూన్ టొమాటో రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి చేతులకి పట్టించి 20 నిమిషాల తరవాత వేడినీటితో కడిగేయాలి. పార్టీకి వెళ్లే గంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది.
14.టొమాటో రసంలో కొన్ని పాల చుక్కలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. క్రమం తప్పకుండా 15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే చర్మం నిగారిస్తుంది.
డ్రై స్కిన్వారి కోసం... 15.విటమిన్’ఇ’ఆయిల్లో మూడు చుక్కల నిమ్మరసం, అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
16.టీ స్పూన్ ఆలివ్ ఆయిల్లో, కొద్దిగా శనగపిండి, పాలమీగడ, కొన్ని చుక్కల తేనె రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
17.టేబుల్ స్పూన్ నారింజ రసంలో పసుపు, కొద్దిగా గంధం పొడి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
18.టీ స్పూన్ బాదం నూనెలో కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరసగా ఏడురోజులపాటు చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.