మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపు చెయ్యవచ్చు. ప్రతిరోజూ సైక్లింగ్, నడక, ఈత వంటి తెలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. దీనివలన గుండె పటిష్టపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి, రక్తనాళాల గోడలు దలసరికాకుండా వుంటాయి. కొన్ని పదార్థాలను తినడం వల్ల రక్తనాళాలకు, గుండెకు ఎంతో మంచిని చేకురుస్తాయి. ఏ ఏ పదార్థాలు తినడం మంచిదో? వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఏమిటో? అవి తినడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ పై ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.
ఆపిల్ పండు:
రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.
బీన్స్ :
బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.
బెర్రీస్:
బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. Bad
వంకాయ: అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.
ద్రాక్ష:
ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది. మధుమేహగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం
జామపండు:
తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.
పుట్టగొడుగులు: కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.