hmtvlive.com

CHANNEL HYDERABAD
రాష్ట్రీయం
Photo

అక్కినేని గుండెకు గతంలో అమర్చిన పేస్ మేకర్ తొలగింపు

 అక్కినేని నాగేశ్వరరావు మరణానంతరం కూడా ఓ నిరుపేద గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోబోతున్నారు. గతంలో బైపాస్ సర్జరీ సందర్భంగా ఆయన హృదయంలో ఏర్పాటు చేసిన పేస్ మేకర్ ను ఓ నిరుపేద హృద్రోగికి అమర్చాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున కేర్ ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో ఆ పేస్ మేకర్ ను తీసి భద్రపరిచారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే ఈ పేస్ మేకర్ ను ఎవరైనా నిరుపేద రోగికి అమర్చే అవకాశం ఉంది.
No img
రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మొన్న గుంటూరు వృత్తి విద్యాధికారి పట్టుకున్న ఏసీబీ తాజాగా కరీంనగర్, చిత్తూరు జిల్లాలో దాడులు నిర్వహించారు. రెండు జిల్లాల్లోనూ ఇద్దరు ఇంజినీర్లను పట్టుకున్నారు.
No img
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అస్పల్లిగూడ సమీపంలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్-లారీ కొనడంతో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. టిప్పర్ లో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యారు. రోడ్డు పనులు చేస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి బోర్డులు పెట్టకపోవడంతో షాబాద్ లో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
No img
రాష్ట్ర విభజన బిల్లుపై రెండో దఫా గడువు పొడిగింపుపై ప్రచారం సాగుతున్నప్పటికీ అదేమీ ఉండకపోవచ్చని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ఇప్పటికే వారం గడువు పొడిగించడమే గొప్ప అనే ధోరణిలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల రోజులు గడువు కావాలని లేఖ రాసినా దానికి తొలుత కేంద్రం ఏ మాత్రం సుముఖత చూపలేదు.
No img
రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభ్యులు అడిగిన సమాచారం ఏదీ ఇచ్చేది లేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. ముసాయిదా బిల్లుపై చర్చించాలంటే దానికి సంబంధించిన అదనపు సమాచారం కావాలంటూ కొంత మంది ఎమ్మెల్యేలు సభాపతి నాదెండ్ల మనోహర్ ను కోరారు.
No img
బిల్లుపై చర్చకు గడువు మరో వారం రోజులు పొడగించిన నేపథ్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. ఓటింగ్ పై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.
No img
రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇవాళ హైకమాండ్ పెద్దలను కలిసి రాజ్యసభ అభ్యర్థుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. కాంగ్రెస్ తరఫున నిలబడే ముగ్గురు అభ్యర్థులనూ ఏకగ్రీవం చేయడంపై దృష్టి సారించడంతో పాటు రెబెల్స్ బెడద లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
No img
అనంతపురములో ఐరన్ మాత్రలు వికటించి 60మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ చిన్నారులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు సరిగా స్పందించక పోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి అద్దాలను పగులగొట్టారు.
No img
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.. అక్కినేని అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల మధ్య అశ్రునయనాలతో ముగిశాయి. రాష్ట్రం నలమూలల నుంచి వచ్చిన అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
No img
గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ ను సైన్యం నిర్వహించింది.
No img
అసెంబ్లీలో తన ప్రసంగం కొనసాగించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోతే అభివృద్ధిలో చాలా వెనకబడతామన్నారు. సమైక్యంగా ఉండడం వల్ల కలిగిన లాభాలను సాక్ష్యాలతో సహా వివరించారు. సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.