Beet root మీ చర్మ సౌదర్యానికి ‘బీట్’రూట్

CHANNEL HYDERABAD
చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా అంటూ సందేశం ఇచ్చే ఓ వక్తలా కనపడుతుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని వైద్యుల నుంచీ డాక్టర్ల వరకూ అంటూ ఉండటం మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్రూట్ ను వెలివేస్తున్నారనీ చెప్పవచ్చు. అయితే బీట్రూట్ ను తినవచ్చు, జ్యూస్ గ వాడుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు. కొందరి ఇళ్ళల్లో వండటం ఇప్పటికే జరుగుతుంది. జబ్బులోస్తే పెట్టే వంటకంగా, జ్యూస్ గా దీనిని వాడుతున్నారేగాని మరొకటి కాదు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మా సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే మా పాఠకులకు బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలియ చేసేందుకు ఈ శీర్షికలో ఇస్తున్నాం. బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలుసుకుందామా..!
1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.
2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.
3. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
4. బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.
5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది