paralysis పక్షవాతాన్నీ నివారించవచ్చు

CHANNEL HYDERABAD

ఏదో పని చేస్తున్న వ్యక్తి మాటల్లో ఉన్నట్లుండి తడబాటు కనిపించిందంటే... అది కచ్చితంగా పక్షవాతమయ్యుంటుందని అనుమానించవచ్చు. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలోని ఒక భాగం మెలిబడిపోతున్న భావన కలుగుతోందంటే అదీ పక్షవాతమేనని పసిగట్టవచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు, పనిలో నిమగమైనప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడు ఈ విధమైన లక్షణాలు కనిపించినా పక్షవాతంగా అనుమానించి వెంటనే అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రికి తరలించడం మేలు.

ఉన్నట్లుండి మాట తడబడుతుంది. ఒక కాలూ, ఒక చేయీ పడిపోతుంది. మూతి వంకరపోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒక భాగం మెలిబడి పోతుంది. ఇవన్నీ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలే. రక్త నాళాల్లో ఎక్కడో కాస్తంత అడ్డు పడిన ఫలితమిది. పక్షవాతానికి గురైన వ్యక్తిని సరైన చికిత్స నిమిషాల్లో తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుందంటు న్నారు సీనియర్‌ న్యూరో సర్జన్‌.

ఎందుకొస్తుంది?
మెదడులోని రక్తనాళంలో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడితే, అది పక్షవాతానికి (హెమీ పెరేసిస్‌) దారి తీస్తుంది. ఒక కాలూ, ఒక చేయీ పడిపోతుంది. మూతి వంకర పోతుంది. దీంతోపాటు చాలా సందర్భాల్లో మాట కూడా పడిపోతుంది. అయితే కేవలం రక్తనాళంలో అడ్డంకి ఏర్పడడం ఒక్కటేగాక, వాటిలో ఒక్కోసారి ఒరిపిడి కారణంగానూ మెదడులో రక్తస్రావం కావడంవల్ల కూడా పక్షవాతం రావచ్చు. పక్షవాతం రావడం హృద్రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో గుండె రక్తనాళాల్లో ఉండిపోయిన కొవ్వు, ఒక్కోసారి రక్తనాళం ద్వారా మెదడులోకి చేరుతుంది. ఇదే పక్షవాతానికి దారితీస్తుంది. మరి పక్షవాతం రావడాన్ని ఎలా గుర్తించవచ్చునంటే... అందుకు సంబంధించి కొందరిలో అతి స్వల్పమైన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట తడబడటం. రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఏదో ఇబ్బంది ఏర్పడం వంటివి కనిపిస్తాయి. ఆ తరువాత ఓ రెండు గంటల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ మామూలు స్థితికి చేరు కుంటాడు. ఈ విధంగా పరిస్థితి చక్కబడగానే సంతోషించి ఊరుకుంటే ప్రమాదమే. నిజానికీ మునుముందు ఒక తీవ్రమైన పక్షవాతం రాబో తోందని చెప్పే హెచ్చరికే అది. దీన్నే (టిఐఎ) ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌ అంటారు. అసలు ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు తీసుకుంటే, తీవ్రస్థాయి పక్షవాతం ఏదీ రాకుండా నివారించవచ్చు. అందుకే పక్షవాతానికి సంబంధించిన అనుమానాలు వచ్చినా, అసహజమైన లక్షణాలేవైనా కనిపించినా వెంటనే న్యూరో ఫిజిషియన్‌ను సంప్ర దిస్తే యాంజియోగ్రఫీ ద్వారా సమస్యను కనుగొం టారు. సంబంధిత వ్యక్తికి గుండె సంబంధ మైన సమస్యలేమైనా ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. మెదడుకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో ఎక్కడైనా అవరో ధం ఏర్పడుతోందా? అన్న విషయాన్నీ పరిశీలిస్తారు..

నిమిషాల్లో....
సాధారణంగా వయసు పైబడటం, పొగ తాగడం, అధిక కొలిస్ట్రాల్‌, అధికరక్తపోటు, స్థూల కాయం వంటి సమస్యలుంటే... ఇవి రక్తనాళాల పరిధిని తగ్గిస్తూ వెళ్తాయి. క్రమంగా ఇవి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటానికి దారితీస్తాయి. ఈ కారణాలతో వచ్చే పక్షవాతం (స్టోక్‌) గానీ మెదడులో రక్తస్రావం (హెమరేజ్‌)గానీ తలెత్తినప్పుడు నాలుగు గంటల్లోపే ఆస్పత్రికి చేర్చగలిగితే, వెంటనే యాంజియోగ్రఫీ చేసి, ఏ రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత క్లాట్‌ రిట్రాక్షన్‌ సిస్టమ్‌ ద్వారా ఆ అడ్డంకిని బయటికి లాగేసే ఏర్పాట్లు చేస్తారు. అందుకు అతి సూక్ష్మమైన ఒక పరికరాన్ని (కాథెడ్రాల్‌) రక్తనాళంలోంచి అడ్డంకి ఉన్న చోటికి పంపి, దాన్ని బయటికి లాగేస్తారు. ఇదేగాక టిపిఎ అనే విధానంలో అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తికాగానే సహజ రీతిలో రక్త ప్రసరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగై పోతాయి. ఒకప్పటి పక్షవాతం చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్ద ముందడుగు..

సమయమే ముఖ్యం
ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తారన్నది చాలా ముఖ్యం. నాలుగు గంటల్లోపే తీసుకొస్తే చాలా మంచిది. అలా వీలుకాని పరిస్థితుల్లో కనీసం ఆరు గంటలలోపైనా రోగిని ఆస్పత్రికి తరలించాలి. ఆ వ్యవధి కూడా దాటిపోతే రక్త ప్రసరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్తకణాలు ఉత్పన్నం కావడం గానీ, మెదడు కణాలను మార్చ డంగానీ సాధ్యం కాదు. కాబట్టి జరిగే నష్టం శాశ్వతంగా ఉండి పోతుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో రోగిని ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మెదడును కాపాడే ఏకైక పరిష్కారం. అలా అయితేనే రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమవుతుంది. అయితే కొందరిలో రక్తనాళంలో అడ్డుపడిన పదార్థం మరీ గట్టిగా ఉండి, బయటికిలాగడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో ఆ భాగంలోకి ఒక బెలూన్‌ను లోనికి పంపి, రక్తనాళాన్ని వ్యాకోచింపజేస్తారు. ఆ వ్యాకోచం స్థిరంగా ఉండకపోతే, ఆ భాగంలో ఒక స్టెంటును కూడా అమర్చాల్సి ఉంటుంది. ఈ చికిత్సల్లో అడ్డు పడిన భాగం ఒరిపిడికి గురయ్యి, అందులో కొంత మెదడులోకి వెళ్లకుండా ఒక గొడుగులాంటి పరికరాన్ని లోపల అమరుస్తారు. ఈ చికిత్స లన్నీ సకాలంలో అంటే.. పక్షవాతం కని పించిన ఏడుగంటలలోపే రోగిని ఆస్పత్రికి తరలిస్తేనే సాధ్యమవు తాయి. నాలుగు గంటల్లోపే తీసుకువస్తే అది మరింత శ్రేయస్కరం. ఏదేమైనా ఈ కొత్త విధానాలు పక్షవాత చికిత్సలో ఒక పెద్ద ముం దడుగే. కాకపోతే వాటిని వినియోగించు కోవడంలో ఆలస్యం జరక్కుండా చూసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసినప్పుడు పక్షవాతానికి పరిష్కారం లభిస్తుంది.