hair fall జట్టు ఊడకుండా...

CHANNEL HYDERABAD

మాములుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్‌ లో భాగమే . జుట్టు ఎదుగుదల దశ ఏడాది నుంచి మూడేళ్ళు సాగవచ్చు . ఇది 90% జుట్టుకు వర్తిస్తుంది . తరువాత దశ తాత్కాలికం ఇది ఆరు వారలు ఉంటుంది . తుది దశ విశ్రాంత దశ . ఇది పది శాతం జుట్టుకు వర్తిస్తుంది.జు ట్టు ఉడి కొత్తసి రావడానికి కొద్ది నెలలు సమయం పడుతుంది . తోలి దశను వైద్య భాషలోఎనాజే న్‌ (గ్రోత్‌ స్టేజ్‌) అని , మోడో దశకు తెలోజేన్‌ (రెస్తింగ్‌ స్టేజ్‌) అని అంటారు. ఈ ఎనాజేన్‌ దశ నుండి తెలోజేన్‌ దశ కు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతూ ఉంటుంది.

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటు న్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెర్సటెల్‌ అనే పదార్థం తో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటు న్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి.

సహజ కారణాలు
వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.

సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.

మానసిక ఒత్తిడి, వౄఎత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం

వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.

స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.

ఇతర కారణాలు
హార్మోన్‌ లోపం.. హైపోథెరాయిడిజం, రక్తాల్పత.. ఇను ము, విటమిన్‌ బి12 లోపం ఇన్‌ఫెక్షన్‌, డెటింగ్‌. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వల్ల, పోశాకాహార లోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది. జుట్టు రాలడం లో 30 నుంచి 40 రకాలు ఉన్నాయి. ప్రధానముగా రెండు రకాలు కనిపిస్తాయి

జాగ్రత్తలు
ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచు కోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలెతే రెండు రోజులకోసారి తప్పనిసరి

కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి

సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందు తుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డెరీ ఉత్పత్తుల్లో అవి సమౄఎద్ధిగా దొరుకుతాయి.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వెద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.