అల్లం టీ సేవించండి.. ఒత్తిడిని తగ్గించండి!

CHANNEL HYDERABAD

అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాసుడు వేడినీటిలో కాసింత అల్లం రసం, నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లంలోని గుణాలు ఆకలిని పెంచుతుంది. అలాగే జీర్ణశక్తిని ప్రేరేపిస్తుందని డైజీషియన్ అలీస్ మంకితోష్ అన్నారు