దంతవ్యాధులకు చెక్ పెట్టే వంటింటి వాము

CHANNEL HYDERABAD

వాము వాతాన్ని హరిస్తుంది. కడుపుబ్బరం, వాంతులను తగ్గిస్తుంది. గుండెకు అత్యంత ఉపకారి. వామును నీళ్ళలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణానికి చెక్ పెట్టవచ్చు.

వామును కరక్కాయ, ఉసిరికాయ, తావికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాలమూలలందు పెట్టినచో దంతవ్యాధులు తగ్గుతాయి. వామునూనె వాత వ్యాధులకు చెక్ పెడతాయి. వామును బుగ్గనపెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి గొంతులో గురగురశబ్దాలు తగ్గుతాయి. స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.