మనిషికి నిద్ర ఎందుకు

CHANNEL HYDERABAD

ప్రతి మనిషి రాత్రి అయ్యేసరికి ఎంత వద్దనుకున్నా నిద్ర వస్తుంది. నిద్రలేకపోతే హాయిగా 24 గంటల్ని ఉపయోగించుకోవచ్చు కదా చాలా అనుకుంటున్నారు? అయితే, నిద్ర అనేది లేకపోతే మనిషి జీవించలేడు.

మనిషి ఆహారం లేకపోతే వారం పది రోజులు జీవించగలడు కానీ నిద్ర లేకుంటే మాత్రం ఒక్క రోజూ కూడా ఉండలేడు. నిద్ర అనేది మనిషికి ఊపిరి ఎంత అవసరమో అంతే అవసరం. నిద్రపోయే సమయంలో మెదడు గతమంతా నెమరువేసుకుని ఏది దాచుకోవాలో.. ఏది వదిలించుకోవాల్సినదో అర్థం చేసుకుని అవసరం అనుకున్న వాటిని దాచిపెట్టుకుంటుంది.

మెదడుకు తగినంత విశ్రాంతి లేకపోతే మిగిలిన శారీరక అంగాలు సంక్రమంగా పని చేయవు. అందుకే మనిషికి కనీస నిద్ర అవసరమని మన శాస్త్రవేత్తలు చెపుతున్నారు.