ఆకుకూరలు, కూరగాయల్లోనే కంటిని కాపాడే పోషకాలెక్కువట

CHANNEL HYDERABAD

మనం రోజూ తీసుకునే ఆహారంలోనే కంటిని కాపాడే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. శాకాహారం.. అంటే కూరగాయలు, ఆకుకూరల్లో ఈ పోషకాలు అధికమని వారు చెబుతున్నారు. తాజా కూరగాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం ఉన్నాయి. ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. దృష్టిలోపం వంటి ఇతరత్రా సమస్యలకు చెక్ పెడతాయి.

పాలకూర, మునగాకు, తోటకూర, మెంతికూరల్లో ఇనుము శక్తి, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి-12 దాగి వున్నాయి. అందుచేత వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరగాయల సలాడ్స్, నిమ్మను కూడా వారానికి రెండు మూడు సార్లు తీసుకోవాలి. తద్వారా కంటిచూపు మెరుగుపడుతుంది.

విటమిన్ ఎలో కంటిని, మెదడును కలిపే విటమిన్ ఉంది. విటమిన్ ఎ ఉండే ఆహారాన్ని తీసుకుంటే రేచీకటిని దూరం చేసుకోవచ్చు. క్యారెట్‌, టమోటా, కోడిగుడ్డు, లివర్, బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉండటం గమనార్హం.

శరీరంలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ ద్వారా కంటిలెన్స్ దెబ్బతింటున్నాయి. అందుచేత మాంసాహారం, పాలు, చేపల్లో ముఖ్యంగా కావాల్సిన 8 అమినో ఆసిడ్స్ వున్నాయి. బియ్యం, బఠాణీలు, బీన్స్, చిక్కుడు, మినపప్పు, కందిపప్పుల్లోనూ అమినో ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.