మనం వండుకునే కూరల్లో చిటికెడైనా పసుపు వేస్తాం. దానితో పాటు మరో 0.5 గ్రాములు అధికంగా వేసుకుంటే పసుపు ఉండే కీలక ఔషధగుణాలు మన శరీరంలోకి అధికంగా చేరతాయి. ఒక గ్లాసు మజ్జిగలో అరచెంచా జీలకర్ర లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగడం వల్ల వాటివల్ల కలిగే ప్రయోజనాన్నీ పొందవచ్చు.
పాలల్లో చిటికెడు మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల డయాబెటిక్ రెటీనోపతికి కారణం అవుతున్న బి-12లోపం నివారణ కావడంతో పాటు మధుమేహం కారణంగా వచ్చే ఇతర జబ్బులను అడ్డుకునే అణువులు మన శరీరంలోకి చేరతాయి. ఏదో ఒక రూపంలో నిమ్మ, అల్లం, ఉసిరిని అధికంగా తీసుకోవడం మంచిది.
ఈ పదార్థాలు మోతాదు మించకుండా రోజూ తీసుకోవడం మధుమేహం ఉన్న వారికి మంచిది అనేది నిపుణుల సలహా.