చాతి నొప్పి (గుండెపోటు) ప్రథమ చికిత్స (Chest pain(heart pain) first Aid)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
గుండెపోటుతో వచ్చే లక్షణాల్లో కొన్ని ఇతర వ్యాధుల్లో ఉండే సాధారణ లక్షణాల్లాగే ఉంటాయి. అందుకే చాలా మంది వాటిని పట్టించుకోరు. ఛాతీలో నొప్పి వస్తేనే గుండె పోటు అనుకునే వారే ఎక్కువ. గుండెపోటులో ఛాతీనొప్పి, శ్వాస ఆడకపోవడం, కాళ్లవాపు, గుండెదడ, కళ్లు తిరిగిపడిపోవడం, త్వరగా అలసి పోవడం, గుండె పట్టేసినట్లు బరువుగా ఉండడం, ఏదో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి రావచ్చు.
కొందరికి దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. అయితే ఈలక్షణాలు గుండెపోటులోనే కాకుండా ఇతర కారణాలతోనూ రావచ్చు. అందుకే ఛాతీ నొప్పి ఎంత సేపటి నుంచి ఉంది ? నొప్పితో పాటు ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా ? అన్నది గమనించాలి. అసౌకర్యంగా ఉండడాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి ఇది గుండెపోటులో కనిపించే ఒక తీవ్ర లక్షణం. గుండెపోటు సమయంలో కొందరికి ఛాతీ మంటలా అనిపిస్తుంది. ఈ మంటను చాలా మంది అసిడిటిగా పొరబడుతుంటారు. ఛాతీ మంటతో పాటు కొందరికి తేన్పులు, ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి.
ముఖ్యమైన లక్షణాలు
గుండె బరువుగా(heavyness) ఉంటూ చెమటలు(sweating) రావడం,
ఛాతీమంట(Heart burn), చాతిలో అసౌకర్యం(Discomfort in chest).
నడవడం లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువవడం, ఆగిపోగానే నొప్పి తీవ్రత తగ్గడం, లేదా నొప్పి మొత్తంగానే లేకుండా పోవడం.
ఎడమ బుజము లేదా ఎడమ దండ కి నొప్పి ప్రాకడం(radiating to left shoulder /Arm),
ఊపిరి తీసుకోవడం కస్టం గాను , బరువు గాను ఉండడం ,
వాంతి అయినట్లు ఉండడం లేదా వాంతి అవడం,
కొందరికి కడుపులో నొప్పిగా ఉండడం , *
ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులకూ దవడలకూ లేదా వెన్ను భాగానికి పాకడం ,
ఏదైనా బరువు ఎత్తుకుని కొంత దూరం నడవగానే నొప్పి మొదలై, బరువు దించగానే నొప్పి తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటే గుండె నొప్పిగా అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రికి చేర్చాలి.
అయితే, పనిచేస్తున్నప్పుడు ఒక మోస్తరుగా ఉంటూ పనిమానగానే నొప్పి అధికమైతే మాత్రం అది గుండెనొప్పి కాదు. ఇలా ఏం చేస్తే నొప్పి పెరుగుతోంది, ఏంచేస్తే నొప్పి తగ్గుతోంది అనే అంశాల ఆధారంగా కూడా అది గుండె నొప్పి అవునో కాదో నిర్ధారించడం వీలవుతుంది.
గుండె నొప్పికీ, గుండె పోటుకీ మధ్య కూడా తేడా ఉంటుంది. ఛాతీ నొప్పి ఉండే కాల వ్యవధిని బట్టి ఆ వ్యత్యాసాలను గుర్తించవచ్చు. ఛాతీ నొప్పి మొదలైన మూడు నిమిషాల్లోనే దానికదే తగ్గిపోతే అది గుండెనొప్పి (chest pain) అనుకోవాలి. అలా కాకుండా నొప్పి 10 నిమిషాలకు మించి కొనసాగుతూ ఉంటే అది గుండెపోటు అనుకోవాలి. అయితే, 20 ఏళ్లలోపు వారిలో ఛాతీనొప్పి వస్తే అది గుండె నొప్పి(chest pain) అయ్యే అవకాశం ఎక్కువ. అదే 60 ఏళ్లు దాటిన వారికి ఛాతీ నొప్పి పస్తే అది గుండెపోటు(heart attack) అయ్యే అవకాశం ఎక్కువ.
ప్రథమ చికిత్స
గుండెనొప్పి గ్రహించిన వెంటనే గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఇసిజి తీసే సమయం ఉండకకపోవచ్చు.
పరిస్థితి విషమంగా ఉందనిపిస్తే వెంటనే కూర్చోబెట్టి గానీ, పడుకోబెట్టి గానీ డిస్పిరిన్-300 మి. గ్రా మాత్ర ను నీటితో కలిపి తాగించాలి.
ఆ తరువాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయాలి. దీంతో నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి.
బిగుతు(tight)గా ఉన్న బట్టలను వదులు (loose) చేయాలి ,
అవసరమైతే ... కుత్రిమ స్వాశ ఇవ్వాలి , cardiopulmonary Resuscitation(cpr) చేయాలి, దీనిలో చేతులతో చాతిని నొక్కాలి , నోటితో ఊపిరిని ఇవ్వాలి . ఒక క్రమ పద్దతిలో చేయాలి.
శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్లాలి. హాస్పిటల్‌కు వెళ్లాక కూడా డాక్టర్ వద్దకు వీల్‌చెయిర్ మీద తీసుకు వెళ్లాలే తప్ప నడిపించకూడదు. డిస్పిరిన్ మాత్ర స్ట్రెప్టోకైనేస్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అంతకు ముందే గుండెజబ్బుకు లోనైన వాళ్లు డిస్పిరిన్, సార్బిట్రేట్ మాత్రలను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం.
గుండెనొప్పి వచ్చినప్పుడు వీలుంటే వెంటనే ఇసిజి తీయించాలి. ఆయితే ఇసిజి కోసం కార్డియాలజిస్టులు ఉండే ఆసుపత్రికి వెళ్లాలే తప్ప డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లకూడదు. చాలా వరకు ఈ సెంటర్‌లలో టెక్నీషయన్ ఉంటాడే తప్ప డాక్టర్ ఉండడదు. డాక్టర్ ఉండకపోవడం వల్ల రిపోర్టుకు ఆలస్యమవుతుంది. ఈ లోగా ప్రాణాపాయం కలగవచ్చు. ఏమైనా గుండెపోటు వచ్చినప్పుడు తొలిగంట అమూల్యమైనది. అందుకే ఆ వ్యవధిలోపే డాక్టర్ వద్దకు చేర్చడం చాలా ముఖ్యం.