అతడు/ఆమె ప్రతి విషయంలోనూ మీతో పోటీపడుతుంటే, మీరు కోరుకున్న ఉద్యోగానికే అతడు/ఆమె కూడా మీకు తెలియకుండా రెజ్యూమ్ పంపడం వంటివి చేస్తుంటే తప్పకుండా వారితో స్నేహాన్ని శంకించాల్సిందే.
అలాగే తనకేవో బాధలున్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి మీతో మాట్లాడటం, మీ సమస్యలు గురించి మీరేమైనా చెప్పబోతే తనకసలు తీరిక లేదన్నట్లు నటించడం, ఇచ్చినమాట, కమిట్‌మెంట్ నిలబెట్టుకోలేక పోవడం అనేది ఒకసారి కాదు అనేకసార్లు జరిగితే ఆ దోస్తీతో స్నేహం కటీఫ్ చేసుకోవడమే బెటర్.
అన్నిటికీ మించి ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు వేరుగా ఉంటే, మీరు వాదించకుండా ఆ స్నేహితుడు/స్నేహితురాలితో ఏకీభవించి ఊరుకోవాల్సి వస్తుంటే... అటువంటి స్నేహితులను నిరభ్యంతరంగా దూరం చేసుకోవడమే మంచిది.