పెరుగులో చక్కెర కలుపుకుని తింటున్నారా...? ఐతే ఏంటట.

CHANNEL HYDERABAD

ప్రస్తుత ఆధునిక జీవితంలో ఉరుకులుపరుగులు తీస్తూ పనుల వెంబడి పరుగెట్టడం తప్ప శరీరానికి కావలసిన సరైన వ్యాయామం, పౌష్టికాహారం చాలామంది తీసుకోవడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోంది. శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే రుతువులకు తగ్గట్టు లభించే కూరగాయలు, పండ్లు, పీచుపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను సేవిస్తుండాలి.

ముఖ్యంగా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి సగ్గుబియ్యం ఉడకబెట్టుకుని అందులో పాలు, చక్కెర కలుపుకుని సేవిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు నిత్యం తక్కువ చక్కెర కలిగిన ఆహార పదార్థాలను సేవించండి. పాలు, టీ, కాఫీ, తీపి పదార్థాలు తీసుకునేటప్పుడు తక్కువ శాతం చక్కెర ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా చాలామంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటుంటారు. ఇలా తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా మధుమేహానికి దారితీస్తుందంటున్నారు వైద్యులు.

ప్రధానంగా మాంసాహారులైతే మాంసాన్ని సేవించడం తగ్గించండి. దీంతో శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోదు. అలాగే ప్రకృతిపరంగా లభించే ఆహారపదార్థాలను నిత్యం క్రమంతప్పకుండా వాడుతుంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చంటున్నారు.