ఆస్త్మా‌కు నట్రమ్ సల్ఫ్ 6xతో ఉపశమనం

CHANNEL HYDERABAD

టిష్యూ రెమిడీస్ అని పిలిచే హోమియో బయోకెమిక్ మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా కణజాలంలో లవణం లోపిస్తే భర్తీ చేయుటకు ఈ మందులు బాగా ఉపయోగపడుతాయి. ఇవి తక్కువ పవర్‌ను కలిగి ఉండటం వల్ల మోతాదు గురించి భయపడవలసిన పని లేదు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడవచ్చు.

అదే బయోకెమిక్ మందులు కాకుండా మిగిలిన హోమియోపతి మందులను తప్పకుండా వైద్యుని సలహా మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. బయోకెమిక్ మందులలో కొన్ని.....

1. నట్రమ్ సల్ఫ్ 6x ఇది కాలేయ సంబంధ వ్యాధులకు వాడవచ్చు. అలాగే వాంతులు, విరేచనాలకు వాడటం ద్వారా త్వరితంగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఆస్త్మా రోగులు ఈ మందును వాడితో ఉపశమనం కలుగుతుంది. వీరిలో ముఖ్యంగా గొంతులోని స్రావాలు ఆకుపచ్చని పసుపు రంగులో ఉంటే తప్పక వాడదగినది ఈ మందు.

దీర్ఘకాలిక జలుబు, తుమ్ములకు వాడవచ్చు నట్రమ్ సల్ఫ్ 6x సమర్థవంతంగా పనిచేస్తుంది. పైత్యం వల్ల కలిగే వాంతులకు కూడా ఇది పని చేస్తుంది.

2. నట్రమ్ ఫాస్ 6x ఇది అజీర్తికి, జీర్ణక్రియలో ఇబ్బందులకు వాడవచ్చు. దీనిని హోమిపతిక్ అంటాసిడ్‌గా చెప్పవచ్చు. ఎసిడిటీతో బాధ పడేవారు తప్పకుండా దగ్గర ఉంచుకోదగినది. కడుపు ఉబ్బరము, కడుపులో మంట, గ్యాస్‌కు ఈ మందు ఉపశమనాన్ని ఇస్తుంది.