అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఏం చేయాలి...?

CHANNEL HYDERABAD

కొంతమందిలో అనుకోకుండా అకస్మాత్తుగా గుండెనొప్పి లేదా గుండెపోటు వస్తుంది. గుండెల్లో సన్నగా మొదలైయిన నొప్పి తీవ్రతరమవుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తి వెంటనే చేస్తున్న పనిని ఆపివేయాలి.

నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కళ్ళు తిరిగినట్లు లేదా తలనొప్పిగా ఉంటే రక్తప్రసరణ చాలావరకు తగ్గిపోయిందని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకాయ రసంలో ఉప్పు కలిపి తాగించాలి.

గుండె నొప్పి భోజనం చేసేటప్పుడు వస్తే భోజనం మెల్లమెల్లగా తినాలి. అదికూడా తక్కువగా తినాలి. గుండెపోటుతో పాటు కళ్ళు తిరగడం లాంటివి లేదా మూర్ఛపోవడం లాంటిది జరిగితే రోగి రెండు కాళ్ళను పైకి లేపి పడుకోబెట్టాలి.

ఒకవేళ వారు హృద్రోగులైతే, హైబీపీ ఉంటే లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులైతే తప్పనిసరిగా వ్యక్తిగత వైద్యుడి ఫోన్ నెంబరు ఉంచుకోవాలి. వైద్యుడిని ఇంటికి తీసుకువచ్చేకన్నా వైద్యశాలకు రోగిని తీసుకువెళ్లాలి. దీంతో రోగిని మృత్యువు నుంచి కాపాడిన వారవుతారు. గుండెపోటు, తలనొప్పి, కళ్ళు తిరగడం, రక్ర ప్రసరణ, హైబీపీ