మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూర పండు పెడితే మూత్రం సాఫీగా అవుతుంది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మంలాంటి వాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు.
డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.