తాజాగా అంతర్జాతీయ కేన్సర్ అధ్యయన సంస్థ (ఐఏఆర్సీ) ఓ కొత్త బాంబు వేస్తోంది. సెల్‌ఫోన్ల అతి వినియోగం కేన్సర్ వ్యాధిని కూడా కలిగిస్తుందిట. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాలు, లాలాజల గ్రంథులను ప్రభావితం చేస్తాయని ఐఏఆర్సీ తెలిపింది.
సెల్‌ఫోన్స్ అధికంగా వాడే వారి కొందరిని శాంపిల్‌గా తీసుకుని వారి లాలాజల గ్రంథులను ఈ సంస్థ పరిశీలించింది. తక్కువగా మొబైల్ వాడే వారితో పోలిస్తే.. వీరి లాలాజల గ్రంథుల నుంచి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నట్లు గుర్తించారు. వీటి వలన జన్యునిర్మాణం మారవచ్చునని, ఇది అంతిమంగా కేన్సర్‌ను కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.